Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి లొంగిపోతాడని భావిస్తున్న పోలీసులు... నరసరావుపేట కోర్టు వద్ద భారీ పహారా!

Pinnelli reportedly surrender at Narasaraopet
  • ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1గా పిన్నెల్లి
  • నిన్నటి నుంచి పోలీసుల గాలింపు
  • హైదరాబాదులో పిన్నెల్లి కారును గుర్తించిన పోలీసులు
  • పోలీసుల అదుపులో పిన్నెల్లి డ్రైవర్, గన్ మన్

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1గా ఉన్న మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం నిన్నటి నుంచి పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు 8 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

నిన్న హైదరాబాదులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును గుర్తించారు. పిన్నెల్లి డ్రైవర్, గన్ మన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చినట్టు తెలిసింది. 

కాగా, పిన్నెల్లి లొంగిపోయే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నరసరావుపేట కోర్టు వద్ద పహారా పెంచారు.

  • Loading...

More Telugu News