Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి అరెస్ట్ కు అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీస్ బృందాలు: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

CEO Meena says they deployed 8 police teams to arrest Pinnelli Ramakrishna Reddy
  • మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి
  • ఇటీవల వీడియో కలకలం
  • పరారీలో పిన్నెల్లి బ్రదర్స్

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉండడంపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు. 

పిన్నెల్లి అరెస్ట్ కు చర్యలు తీసుకున్నామని, అతడిని అరెస్ట్ చేసేందుకు అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీస్ బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మాచర్ల ఘటనలకు సంబంధించి ఇప్పుడు పరామర్శలు సరికాదని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. 

కాగా, ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలతో కూడిన వీడియో ఈసీ నుంచి బయటికి వెళ్లలేదని... దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతి నుంచో ఆ విజువల్స్ బయటికి వచ్చాయని ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. 

ఈవీఎం ధ్వంసం ఘటనలో పీవో, ఏపీవోల సస్పెన్షన్ కు ఇప్పటికే ఆదేశాలిచ్చామని తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో... ఈ నెల 25 నుంచి స్ట్రాంగ్ రూంల పరిశీలనకు రాష్ట్రంలో పర్యటిస్తానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News