ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ జీప్.. వీడియో ఇదిగో!
- డాక్టర్ ను అరెస్ట్ చేయడానికి ఆసుపత్రిలోకి జీప్ లో వెళ్లిన పోలీసులు
- ఎంట్రెన్స్ లో ఆసుపత్రి సిబ్బంది ఆందోళన
- రిషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఘటన
రిషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో విధినిర్వహణలో ఉన్న తనను నర్సింగ్ ఆఫీసర్ లైంగికంగా వేధించాడని, అసభ్యంగా సైగలు చేస్తూ సందేశాలు పంపించాడని ఓ డాక్టర్ ఆరోపించింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఎయిమ్స్ లో ఆందోళనలకు దారితీసింది. వైద్యురాలికి మద్దతుగా మిగతా డాక్టర్లు, సిబ్బంది ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడ ఆందోళన చేస్తున్న వారంతా పోలీసులను చుట్టుముట్టారు. బాధిత వైద్యురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడిపై నిరసనకారులు దాడి చేసే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. తమ వాహనాన్ని నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. వార్డులోని రోగుల బెడ్స్ ను ఎయిమ్స్ సిబ్బంది పక్కకు జరుపుతుండగా పోలీస్ జీప్ లోపలికి వస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వాహనం వెంటే లోపలికి చేరుకున్న ఆందోళనకారులను తప్పించుకుంటూ నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.