TSRTC: తెలంగాణ ఆర్టీసీకి ఇంకా కొత్త లోగో విడుదల చేయలేదు: సజ్జనార్

Telangana RTC management did not release new logo yet
  • కొత్త లోగో ఖరారు కాలేదని స్పష్టీకరణ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లోగో నకిలీదని వెల్లడి
  • ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వివరణ

తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తప్పుబట్టారు. కొత్త లోగో ఇంకా సిద్ధం కాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
 
‘కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ ఆర్టీసీ  కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

  • Loading...

More Telugu News