New Sim Card: సిమ్‌కార్డు కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే!

New telecom rules likely to be implemented from September 15
  • నకిలీ సిమ్‌లతో పెరుగుతున్న సైబర్ మోసాలు
  • ఇకపై బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్
  • సెప్టెంబర్ 15  నుంచి అమల్లోకి

నకిలీ సిమ్‌కార్డులతో జరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా సిమ్‌కార్డుల జారీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. యథేచ్ఛగా జారీ అవుతున్న సిమ్‌కార్డులను ఉపయోగించుకుని నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికమ్యూనికేషన్ చట్టం-2023లో తీసుకొచ్చిన నిబంధనలను సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకురావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ష్ (డీవోటీ) నిర్ణయించింది.

కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, అడిగిన వెంటనే సిమ్‌కార్డు జారీ ఉండదు. బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్ జారీచేస్తారు. అలాగే స్పెక్ట్రమ్ కేటాయింపులతోపాటు శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలన్నా స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది.

  • Loading...

More Telugu News