Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు, మంత్రులతో రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్

Revanth Reddy zoom meeting with teenmar mallanna and ministers
  • ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం  
  • ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచన
  • ప్రతీ ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలని సూచన

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపై పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జ్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంఛార్జ్‌లు క్రియాశీలకంగా పనిచేయాలని ఆదేశించారు.

ఈనెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాలన్నారు. ప్రతీ ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఆయన గెలుపు ఉపయోగపడుతుందన్నారు. ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదని.. కాంగ్రెస్ ఎన్నిక అని గుర్తించాలన్నారు.

  • Loading...

More Telugu News