Kamal Haasan: ‘భార‌తీయుడు 2’... నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Bharatheeyudu 2 lyrical song released
  • కమల్ హీరోగా రూపొందుతున్న 'భారతీయుడు 2'
  • శంకర్ నుంచి రానున్న మరో భారీ చిత్రం 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న అనిరుధ్
  • పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా  

క‌మ‌ల్ హాస‌న్‌ .. శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

1996లో క‌మ‌ల్ హాస‌న్‌ - శంక‌ర్ కాంబినేష‌న్‌లో విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూస్తోన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా బుధ‌వారం రోజున మేక‌ర్స్ ‘భారతీయుడు 2’ మూవీ నుంచి ‘శౌర..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. 

పాట‌లో చూపించిన కొన్ని విజువ‌ల్స్ చూస్తుంటే 'భార‌తీయుడు 2' అంచ‌నాల‌ను మించేలా శంక‌ర్ తెరకెక్కించార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీత సార‌థ్యంలో సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాట‌ను రితేష్ జి.రావ్‌, శ్రుతికా స‌ముద్రాల పాడారు. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

  • Loading...

More Telugu News