దేశంలోని అన్ని నగరాలు ఇండోర్‌లా మారాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
- ఇండోర్‌లోని రోడ్లు పరిశుభ్రంగా ఉండటాన్ని వీడియో తీసి పోస్ట్ చేసిన విదేశీయుడు
- అదే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- అన్ని నగరాలను ఇండోర్‌లా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలను ఇండోర్‌లా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అసలు విషయం ఏమిటంటే.. ఓ విదేశీయుడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని రోడ్లు పరిశుభ్రంగా ఉండటాన్ని వీడియో తీసి పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఆ వీడియో కాస్తా ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది. దీంతో వీడియోను ఆయన షేర్ చేశారు. ఇండోర్ నగర ప్రజల నిబద్ధతను అభినందించారు. ఇక ఇండోర్ వరుసగా ఏడో సంవత్సరం భారత్‌లో పరిశుభ్ర నగరంగా నిలిచిన విషయం తెలిసిందే.