Realme GT 6T: రియల్​ మీ జీటీ 6టీ.. సోనీ కెమెరా, హైస్పీడ్​ చార్జింగ్, ఇతర ఫీచర్లు, ధర వివరాలివిగో..!

realme gt 6t price and features
  • మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ను మార్కెట్లోకి తెచ్చిన రియల్ మీ
  • మే 29వ తేదీ నుంచి విక్రయాలు మొదలవుతాయని ప్రకటన
  • ఐసీఐసీఐ, హెచ్‌ డీఎఫ్‌ సీ, ఎస్‌ బీఐ క్రెడిట్ కార్డులతో రూ.4,000 డిస్కౌంట్

రియల్ మీ సంస్థ తమ మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో మరో కొత్త వేరియంట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ మీ జీటీ 6టీ తీసుకొచ్చిన ఈ ఫోన్ ను బుధవారం విడుదల చేసింది. మే 29వ తేదీ నుంచి దీన్ని అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటించింది. అద్భుతమైన ఎంఓఎల్ఈడీ డిస్ ప్లేతో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సోనీ సెన్సర్ తో కూడిన కెమెరాతో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటుందని కంపెనీ చెప్తోంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు ఏమిటో చూద్దామా..

రియల్ మీ జీటీ 6టీ ఫోన్ ఫీచర్లు ఇవే..

  • దీనిలో 6.78 అంగుళాల భారీ ఎంఓఎల్ఈడీ డిస్ ప్లే ఇచ్చారు.  ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో 120 హెట్జ్ రీఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది.
  • అత్యంత అధునాతన స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ ను అమర్చారు.
  • 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ లతో.. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ మెమరీతో వేర్వేరు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. realme gt 6t features 
  • వెనుక భాగాన సోనీ ఎల్ వైటీ–600 సెన్సర్ తో కూడిన 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
  • మెయిన్  కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టు ఉందని కంపెనీ తెలిపింది. అంటే ఫొటోలు, వీడియోలు బ్లర్ రాకుండా ఉంటాయి.
  • 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మీ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారు. భవిష్యత్తులో మూడు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ గ్రేడ్ లు కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది. 
  • ఈ ఫోన్ 2జీ నుంచి 5జీ దాకా నెట్ వర్క్ లను సపోర్ట్ చేస్తుంది. ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.
  • రియల్ మీ వెబ్ సైట్లో, అమెజాన్‌ లో మే 29వ తేదీ నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌ డీఎఫ్‌ సీ, ఎస్‌ బీఐ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  • ఇక ఏదైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. రూ.2,000 బోనస్‌ ఇస్తారు. అంటే మొత్తంగా రూ.6,000 వరకు డిస్కౌంట్ అందుతుంది.
వేరియంట్లను బట్టి ధరలు ఇవీ..
  • 8జీబీ ర్యామ్ 128 జీబీ మెమరీ ఉన్న బేసిక్ మోడల్ ధర రూ.30,999
  • 8జీబీ ర్యామ్ 256 జీబీ మెమరీ మోడల్ ధర 32,999
  • 12 జీబీ ర్యామ్ 256 జీబీ మెమరీ మోడల్ ధర 35,999
  • 12 జీబీ ర్యామ్ 512 జీబీ మెమరీ మోడల్ ధర 39,999


  • Loading...

More Telugu News