ఐదే ఐదు నిమిషాల్లో 10 వేల స్టూడెంట్ వీసా స్లాట్ల బుకింగ్.. ఆందోళనలో విద్యార్థులు
- ఎఫ్ 1 వీసా ఇంటర్వ్యూలకు విపరీతమైన డిమాండ్
- ఇలా స్లాట్లు తెరవగానే అలా బుక్ అయిపోతున్న వైనం
- అమెరికా వర్సిటీల్లో సీటు వచ్చినా ఎఫ్ 1 వీసా ఇంటర్వ్యూకు స్లాట్ దొరకని పరిస్థితి
వచ్చే విద్యా సంవత్సరంలో అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చేరేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వీసా ఇంటర్వ్యూ విషయంలోనే ఇబ్బంది పడుతున్నామని వివరించారు. ఇంటర్వ్యూ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడం గగనమైపోయిందని, స్లాట్లు దొరకడంలేదని వాపోయారు. తాజాగా సోమవారం కూడా ఐదు నిమిషాల్లో పది వేల వీసా స్లాట్లు బుక్ కావడంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో పలువురు విద్యార్థులు తమ పరిస్థితిని వివరిస్తూ వీసా స్లాట్లు పెంచాలంటూ అమెరికన్ ఎంబసీకి ఆన్ లైన్ లో రిక్వెస్ట్ పెడుతున్నారు. ఈ విజ్ఞప్తులపై హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ ట్విట్టర్ లో స్పందించారు. స్టూడెంట్ వీసా సెషన్ ను రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.