Revanth Reddy: తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Visited Tirumala
  • కుటుంబ స‌మేతంగా శ్రీవారిని ద‌ర్శించుకున్న రేవంత్‌
  • స్వామివారికి మనవడి పుట్టు వెంట్రుకల స‌మ‌ర్పణ 
  • మంగ‌ళవారం రాత్రి తిరుమ‌ల‌లోనే బ‌స చేసిన రేవంత్ రెడ్డి కుటుంబం
తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఉద‌యం శ్రీవారికి మనవడి పుట్టు వెంట్రుకలను స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత ఉద‌యం 8.30 గంట‌ల‌కు వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి త‌న భార్య‌, కూతురు, అల్లుడితో క‌లిసి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. 

ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది. కాగా, శ్రీవారి దర్శనార్థం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మంగ‌ళ‌వారమే తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్ లోని రచన అతిథి గృహంలో రాత్రి బస చేశారు.
Revanth Reddy
Telangana
Tirumala
TTD
Andhra Pradesh

More Telugu News