కూలిపోవడానికి ముందు హెలికాప్టర్‌లో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి.. వీడియో ఇదిగో!
- అజర్ బైజాన్ సరిహద్దులో డ్యామ్ ప్రారంభించి తిరిగి వస్తుండగా కూలిన హెలికాప్టర్
- మృతుల్లో అధ్యక్షుడు, మంత్రితోపాటు మరో 8 మంది అధికారులు
- 16 గంటల అన్వేషణ తర్వాత శిథిలాల గుర్తింపు
హెలికాప్టర్ ఎక్కడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు సమావేశమయ్యారు. టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత దానితో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 16 గంటల అన్వేషణ తర్వాత హెలికాప్టర్ శిథిలాలను ఓ పర్వత శిఖరంపై గుర్తించారు.