హైదరాబాద్ లో కొండెక్కిన కోడి ధర
- గత వారం కిలో చికెన్ ధర రూ. 250 - 280
- ఇప్పుడు రూ. 300కు చేరుకున్న వైనం
- పెరిగిన ధరలతో భారీగా పడిపోయిన అమ్మకాలు
పెరిగిన చికెన్ ధరలతో రీటైల్ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. వినియోగదారులు చికెన్ షాపులకు వెళ్లడాన్ని తగ్గించేశారు. బిజినెస్ తగ్గడంతో చికెన్ రీటైల్ వ్యాపారులు కూడా డీలా పడిపోతున్నారు. మొన్నటి వరకు రోజుకు 20 కిలోల చికెన్ అమ్మేవాడినని... ఇప్పుడు 10 కిలోలు మాత్రమే సేల్ అవుతోందని ఒక వ్యాపారి వాపోయాడు.