Chandrababu: అమెరికాకు చంద్రబాబు.. భువనేశ్వరితో కలిసి పయనం

TDP chief Chandrababu leaves for America
  • వైద్య పరీక్షల కోసం వెళ్లారన్న పార్టీ వర్గాలు
  • ఐదారు రోజుల్లో తిరిగి హైదరాబాద్‌కు
  • ఇప్పటికే అమెరికా వెళ్లిన లోకేశ్
వైద్య పరీక్షల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అమెరికా వెళ్లారు. గతంలో ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయన గత రాత్రి భార్య భువనేశ్వరితో కలిసి హైదరాబాద్ నుంచి అమెరికా పయనమయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఐదారు రోజుల్లో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

దాదాపు రెండుమూడు నెలలపాటు ఎన్నికల హడావుడితో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు ఇటీవలే పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నారు. చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇప్పటికే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.
Chandrababu
Telugudesam
America
Nara Lokesh

More Telugu News