Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ!

Rush in Tirumala as devotees throng to the temple
  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో కిటకిట
  • రింగురోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకూ 3 కిలోమీటర్ల మేర క్యూ
  • శ్రీవారి దర్శనానికి 24 గంటలు 
  • వేసవి సెలవుల నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం పోటెత్తడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిటకిటలాడుతున్నాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భనవం వరకూ సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. కాగా, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది.

క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు. అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది.
Tirumala
Tirupati
Andhra Pradesh
Telangana

More Telugu News