Rahul Gandhi: అగ్నివీర్‌ పథకాన్ని చెత్తబుట్టలో వేస్తా: రాహుల్ గాంధీ

Will throw Agniveer scheme in bin simplify GST help small businessmen says Rahul Gandhi in Delhi
  • ఢిల్లీ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగం
  • నిరుద్యోగులకు తొలి ఉద్యోగం హక్కుగా ఇస్తామని ప్రకటన
  • పేద కుటుంబాల్లోని మహిళలకు నెల నెలా రూ.8 వేలు ఇస్తామని హామీ
  • జీఎస్టీని సరళీకరించి చిరు వ్యాపారులను ఆదుకుంటామని భరోసా
  • అంబానీ-అదానీలకు మోదీ కోట్లు ఖర్చు కట్టబెట్టారంటూ విమర్శలు
దేశ ప్రజల భవిష్యత్తు అయిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి పనిచేస్తుందని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ పోల్ ర్యాలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ తెచ్చిన అగ్నీవీర్ పథక న్ని తాము అధికారంలోకి వచ్చాక చెత్త బుట్టలో వేస్తామని, జీఎస్టీని సరళీకరిస్తామని అన్నారు. బడా వ్యాపారవేత్తలకు బదులు చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తామని అన్నారు. 

‘‘ రాజ్యాంగాన్ని రక్షించేందుకు మా కార్యకర్తలు అందరూ ఏకమయ్యారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ, మోదీ అంటున్నారు. కాబట్టి, దాన్ని రక్షించడం మా మాధ్యత’’ అని అన్నారు. 

గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డిప్లోమా హోల్డర్లతో కూడిన  లిస్టును తయారు చేస్తున్నట్టు చెప్పారు. వారికి తొలి ఉద్యోగం హక్కుగా కల్పిస్తామని, ఏటా రూ.1 లక్ష పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ వాళ్లు 5 కిలోల రేషన్ ఇస్తే తాము 10 కిలోల రేషన్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు. 

పేదలతో కూడిన జాబితా కూడా తయారు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ కుటుంబాల నుంచి ఒక మహిళను ఎంపిక చేసి ఏటా రూ. లక్ష వారి అకౌంట్లో జమ చేస్తామని అన్నారు. నెలకు రూ.8 వేల చొప్పున వాళ్ల అకౌంట్లలో టకటకా పడిపోతాయని చెప్పారు. తాను ఏ పదాలు వాడితే మోదీ కూడా తన ప్రసంగాల్లో అదే పదాలు వాడుతున్నారని అన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెబితే అదే మోదీ నోట తాను పలికిస్తానని సెటైర్ వేశారు. 

కాంగ్రెస్ కు అంబానీ, అదానీల నుంచి డబ్బులు అందుతున్నాయని ఆరోపిస్తున్న మోదీ ఈ విషయంలో దర్యాప్తునకు ఎందుకు ఆదేశించరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధానితో డిబేట్ జరిగితే తాను అంబానీ-అదానీతో ఆయన సంబంధం ఏంటో ప్రశ్నిస్తానని పేర్కొన్నారు. ప్రధానితో చర్చకు తాను ఎప్పుడైనా రెడీ అని అన్నారు. కానీ మోదీ మాత్రం కేవలం ఓ 10 మంది జర్నలిస్టులకు దాదాపు 35 ఇంటర్వ్యూలు ఇచ్చి సరిపెట్టారని పేర్కొన్నారు. అంబానీ-అదానీ లాంటి వ్యాపారవేత్తలకు రూ.16 లక్షల కోట్లు కట్టబెట్టిన మోదీ చిరు వ్యాపారులకు మాత్రం రిక్త హస్తాలు చూపించారని రాహుల్ విమర్శిచారు. ఇతర పార్టీల నేతలు అనేక మంది అరెస్టు అవుతున్నారని, రాజ్యాంగాన్ని రక్షించడమే తమ తక్షణ  కర్తవ్యమని రాహుల్ గాంధీ చెప్పారు.
Rahul Gandhi
Agnipath Scheme
GST
New Delhi
BJP
Narendra Modi

More Telugu News