మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డిపై కేసు
- పేట్ బషీరాబాద్‌లో రెండున్నర ఎకరాల స్థలం వివాదంలో కేసు
- ఫెన్సింగ్ కూలగొట్టి దౌర్జన్యం చేశారని బాధితుల ఫిర్యాదు
- మల్లారెడ్డికి మద్దతుగా వెళ్లిన అనుచరులపై కూడా కేసు
స్థలం వివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు, ల్యాండ్‌లో ఫెన్సింగ్ కూలగొట్టి దౌర్జన్యం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మామాఅల్లుళ్లకు మద్దతుగా వెళ్లిన పలువురు అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.