Bonda Uma: జ‌గ‌న్‌కు టీడీపీ నేత బొండా ఉమ స‌రికొత్త స‌వాల్‌!

TDP Leader Bonda Uma fires on YSRCP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఎన్నిక‌లు ముగియ‌డంతో ఇప్పుడు అంద‌రీ దృష్టి జూన్ 4వ తేదీన వ‌చ్చే ఫ‌లితాల‌పై ఉంది. ఈ నేప‌థ్యంలో అధికార వైసీపీ, కూటమి పార్టీలు త‌మ విజ‌యం ప‌ట్ల ధీమాగా ఉన్నాయి. ఎవ‌రికి వారే త‌మ‌దే విజ‌యం అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత బొండా ఉమ తాజాగా వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. 

ఈసారి త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్న సీఎం జ‌గ‌న్‌.. ఒకవేళ కూటమి గెలిస్తే వైసీపీని మూసేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించాల‌ని స‌వాల్ చేశారు. ప‌రాజయం త‌ప్ప‌ద‌నే భ‌యం ఆ పార్టీ కీల‌క నేత‌లైన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి ముఖాల‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని బొండా ఉమ చుర‌క‌లంటించారు. ఇక వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు త‌ప్పితే ఇంకెవ‌రూ బాగుప‌డ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.
Go Back to Shorts
Bonda Uma
TDP
YSRCP
YS Jagan
Andhra Pradesh
AP Politics

More Telugu News