బాలిక వేలుకి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేసిన వైద్యుడు
- కేరళలో ఓ వైద్యుడి నిర్వాకం
- ఆరో వేలు తొలగించుకునేందుకు హాస్పిటల్‌లో చేరిన బాలిక
- విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు
- నివేదికను పరిశీలించి బాధ్యుడైన వైద్యుడిని తొలగించిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి
కాగా ఇద్దరు పిల్లలకు ఒకే రోజు శస్త్ర చికిత్సలు జరగాల్సి ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి అధికారులు తమకు చెప్పారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన కేరళలో తీవ్ర దుమారం రేపింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అందిన నివేదికను పరిశీలించి మంత్రి వీణా జార్జ్ రంగంలోకి దిగారు. బాధ్యుడైన డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు. శస్త్రచికిత్సలు, ఇతర వైద్య ప్రక్రియలకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైద్యుడిపై పోలీసు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని), 337 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగిస్తూ గాయపరిచినందుకు) సెక్షన్లను చేర్చారు. కాగా ఈ ఘటనపై కేరళలో విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.