Pawan Kalyan: 81.86 శాతం ఓటింగ్ జరగడం ఆనందం కలిగించింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked AP people
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో జరిగిన సార్వత్రిక పోలింగ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమస్కారం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

"ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయినందుకు అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. 

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే, ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా, పౌర సంఘాలు పోషించిన బాధ్యతాయుత పాత్రకు ధన్యవాదాలు" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
AP Elections
Andhra Pradesh

More Telugu News