Yakshini: బాహుబలి నిర్మాతల నుంచి 'యక్షిణి' హారర్ సిరీస్!

Yakshini Series Update
  • మరో హారర్ థ్రిల్లర్ గా 'యక్షిణి' 
  • టైటిల్ రోల్ పోషించిన వేదిక 
  • కీలకమైన పాత్రలో మంచు లక్ష్మి 
  • త్వరలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  

'బాహుబలి' సినిమాను నిర్మించిన ఆర్కా మీడియావారు, ఆ తరువాత వెబ్ సిరీస్ లపై కూడా దృష్టిపెట్టారు. ఈ బ్యానర్ నుంచి వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బ్యానర్ నుంచి ఇప్పుడు ఓ తెలుగు సిరీస్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. ఆ సిరీస్ పేరే 'యక్షిణి'. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సిరీస్ నిర్మితమైంది. 

ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. 'యక్షిణి'గా వేదిక కనించనుందని సమాచారం. ఇతర ముఖ్యమైన పాత్రలలో రాహుల్ విజయ్ .. అజయ్ .. మంచు లక్ష్మి కనిపించనున్నారు. 

ఈ వెబ్ సిరీస్ మొదటినుంచి చివరివరకూ అనూహ్యమైన మలుపులతో నడుస్తుందనీ, హారర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ ..  మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సిరీస్ ను అందించనున్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. 

  • Loading...

More Telugu News