Gandi Babji: ఆ యువ‌త ఓట్లు కూట‌మికే: టీడీపీ నేత గండి బాబ్జీ

TDP Visakhapatnam president Gandi Babji Sensational Comments
  • ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏపీకి చెందిన 25 ల‌క్ష‌ల మంది యువ‌త త‌ర‌లి వ‌చ్చి కూటమికి భారీ ఎత్తున ఓటు వేశార‌న్న బాబ్జీ 
  • టీడీపీ భారీ మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని జోస్యం
  • ప్ర‌జ‌లు విసిగి పోయార‌న్న బాబ్జీ 

విశాఖ టీడీపీ పార్టీ అధ్య‌క్షుడు గండి బాబ్జీ బుధ‌వారం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏపీకి చెందిన 25 ల‌క్ష‌ల మంది యువ‌త త‌ర‌లి వ‌చ్చి కూటమికి భారీ ఎత్తున ఓటు వేశార‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిగిన పోలింగ్ ప్ర‌కారం టీడీపీ భారీ మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌న్నారు. జ‌గ‌న్‌కు ఇచ్చిన అవ‌కాశాన్ని దుర్వినియోగం చేసుకోవ‌డంతో ప్ర‌జ‌లు విసిగి పోయార‌ని తెలిపారు. 

వైవీ సుబ్బారెడ్డి, ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, విజ‌య‌సాయి రెడ్డి, జీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ముఠాగా ఏర్ప‌డి వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ ఆస్తులు దోచేశార‌ని ఆరోపించారు. ఎన్‌సీసీ, ద‌స‌ప‌ల్లా, సీబీసీఎన్‌సీ, రేడియండ్‌, హ‌య‌గ్రీవ వంటి వేల కోట్ల రూపాయ‌ల విలువైన భూములు వారి చేతుల్లోకి వ‌చ్చాయ‌ని మండిప‌డ్డారు.

  • Loading...

More Telugu News