Devara: 'దేవ‌ర' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌!

Devara First Single Fear Song Released on 19th May
షార్ట్స్‌లో చూడండి
  ఎన్‌టీఆర్, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న దేవ‌ర నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మే 20వ తేదీన తార‌క్ బ‌ర్త్‌డే కాగా ఒక‌రోజు ముందే 19న 'ఫీయ‌ర్ సాంగ్‌'ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తాజాగా ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. "పెను తుపాను కోసం అంతా సెట్ చేశాం. #FearSong మే 19న తీరాన్ని చుట్టుముట్టి సునామీని సృష్టిస్తుంది" అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసింది. దీనికి ఎన్‌టీఆర్ క‌త్తి ప‌ట్టుకున్న మాస్ పోస్ట‌ర్‌ను జ‌త చేశారు. 

ఇక ఈ మూవీలో తార‌క్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే మ‌రో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ రవిచందర్‌ బాణీలు అందిస్తున్నాడు. 'జ‌న‌తా గ్యారెజ్' వంటి సూప‌ర్ హిట్‌ త‌ర్వాత ఎన్‌టీఆర్‌, కొర‌టాల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో దేవ‌ర‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.
Go Back to Shorts
Devara
Jr NTR
Koratala Siva
Tollywood

More Telugu News