రామ్-పూరీ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’.. టీజర్ విడుదల!
- రామ్ పోతినేని బర్త్‌డే సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ విడుదల
- మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న యంగ్ హీరో
- ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ పై ఇప్పటికే భారీ అంచనాలు
ఇక స్టోరీ రివీల్ చేయకుండా మరోసారి ఇస్మార్ట్ శంకర్ రోల్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించాడు రామ్. ఈ చిత్రంలో విలన్ నటిస్తున్న సంజయ్ దత్ పాత్రను కూడా పరిచయం చేశారు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. పూరీ ముంబైలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫైటింగ్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు పెడుతున్నాడని సమాచారం. ఇక మూవీలో ఇతర ప్రధాన పాత్రల్లో అలీ, కావ్య థాపర్, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను తదితరులు నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=tq2HmozH_5Y