కరీంనగర్ వీధుల్లో కుటుంబ సభ్యులతో స్కూటీపై బండి సంజయ్ చక్కర్లు... ఇదిగో ఫొటోలు
- నిన్నటి వరకు క్షణం తీరికలేని రాజకీయ నాయకులు
- పోలింగ్ ముగియడంతో నేడు రిలీఫ్ అయిన ఆయా పార్టీల అభ్యర్థులు
- కుటుంబ సభ్యులతో బేకరీకి వెళ్లి ఐస్ క్రీమ్, సమోసా తిన్న బండి సంజయ్
బండి సంజయ్ కూడా నిన్న పోలింగ్ ముగియడంతో ఈరోజు తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. స్కూటీపై సరదాగా కరీంనగర్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. బేకరీకి వెళ్లి ఐస్ క్రీమ్, సమోసా తిన్నారు. ఆ తర్వాత స్కూటీ పైనే తిరిగి ఇంటికి వచ్చారు. బండి సంజయ్ కరీంనగర్ వీధుల్లో స్కూటీపై చక్కర్లు కొడుతున్న వైనాన్ని చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.