14 మంది ప్రాణాలు తీసిన ముంబై హోర్డింగ్ యజమాని గురించి వెలుగులోకి కీలక అంశాలు
- అక్రమ హోర్డింగ్స్ పెట్టినందుకు భవేశ్‌పై ఇప్పటికే 20 సార్లు జరిమానా
- ఈ ఏడాది ప్రారంభంలో అతనిపై అత్యాచారం కేసు నమోదు
- అనుమతించిన పరిమాణం కంటే తొమ్మిది రెట్లు పెద్దది కావడమే ప్రమాదానికి కారణమని గుర్తింపు
జాతీయ మీడియా కథనాల ప్రకారం... అక్రమ హోర్డింగ్స్ పెట్టినందుకు భవేశ్‌పై ఇప్పటికే 20సార్లు జరిమానా పడింది. ఈ ఏడాది ప్రారంభంలో అతనిపై ఒక అత్యాచారం కేసు కూడా నమోదైంది. అతను ముందస్తు బెయిల్‌పై బయట ఉన్నాడు. ఇప్పుడు ప్రమాదానికి కారణమైన హోర్డింగ్‌కు ఎలాంటి ముందస్తు అనుమతి లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ హోర్డింగ్ అనుమతించిన గరిష్ఠ పరిమాణం కంటే తొమ్మిది రెట్లు పెద్దదిగా ఉన్నట్లు తెలిపారు.
నిన్న ములుంద్ ప్రాంతంలోని భవేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భవేశ్ తన కుటుంబంతో కలిసి దేశం దాటాడని బీజేపీ నేత కిరిట్ సోమయ్య విమర్శించారు.