BCCI: టీమిండియా హెడ్ కోచ్ ద‌ర‌ఖాస్తుల‌కు బీసీసీఐ ఆహ్వానం.. అర్హ‌త‌లివే..!

BCCI Criteria For New Team India Head Coach Job
  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో ముగుస్తున్న ప్రస్తుత కోచ్ ద్రావిడ్ ప‌ద‌వీకాలం
  • ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు కొత్త కోచ్ ప‌ద‌వీకాలం
  • కనీసం 30 టెస్టు మ్యాచ్‌లు లేదా 50 వ‌న్డేలు ఆడి ఉండాలి
  • అలాగే 60 ఏళ్ల‌ కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలన్న‌ బీసీసీఐ

భార‌త క్రికెట్ సీనియ‌ర్ పురుషుల జ‌ట్టు హెడ్ కోచ్ పోస్టుకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ద‌ర‌ఖాస్తుల్ని ఆహ్వానించింది. ఈ మేర‌కు సోమ‌వారం ఒక ప్ర‌ట‌క‌న విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం టీమిండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ప‌ద‌వీకాలం టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో ముగుస్తుంది. అంటే జూన్ చివ‌రి నాటికి ద్రావిడ్ కోచ్‌గా వైదొలుగుతారు. దీంతో కొత్త కోచ్ ప‌ద‌వీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు ఉంటుంద‌ని బీసీసీఐ తెలిపింది. అంటే కొత్త‌గా కోచ్ ప‌ద‌వికి ఎంపిక‌యిన వ్య‌క్తి 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా కొన‌సాగుతాడు. 

ఇక బీసీసీఐ ఇచ్చిన తాజా ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. "కొత్త కోచ్‌కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్‌ కోచ్ గా కొన‌సాగుతాడు. టీమ్‌ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్‌లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యత" అని బీసీసీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.  

అలాగే హెడ్ కోచ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హ‌త‌ల‌ను కూడా ఈ సంద‌ర్భంగా బీసీసీఐ వెల్ల‌డించింది. కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వ‌న్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి. ఐపీఎల్‌ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ A జ‌ట్ల‌కు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు ప‌నిచేసి ఉండాలి. లేదా బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ కండిష‌న్ల‌లో ఏది ఉన్నా స‌రే.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని బీసీసీఐ తెలిపింది. ఇక పారితోషికం అనుభవాన్ని బ‌ట్టి ఉంటుంద‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News