Shaheen Afridi: ఆఫ్ఘన్ అభిమానితో పాక్ స్టార్ పేస‌ర్ గొడ‌వ‌.. ఫ్యాన్‌ను స్టేడియం నుంచి వెళ్ల‌గొట్టిన సెక్యూరిటీ సిబ్బంది!

Afghan fan ejected after misbehaving with Shaheen Afridi
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ స్టార్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది ఆఫ్ఘన్ అభిమానితో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. ఆదివారం ఐర్లాండ్, పాక్ మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అఫ్రిది డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానానికి వెళ్తున్న స‌మ‌యంలో ఆఫ్ఘన్‌కు చెందిన ఓ అభిమాని అస‌భ్య‌క‌ర‌మైన భాష‌తో ఏదో అన‌డంతో అఫ్రిది ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. దాంతో ఆ ఫ్యాన్‌తో గొడ‌వ‌కు దిగాడు. ఇది గ‌మ‌నించిన సెక్యూరిటీ సిబ్బంది అఫ్రిదిని సముదాయించారు. అనంత‌రం ఆ అభిమానిని స్టేడియం నుంచి బ‌య‌ట‌కు పంపించి వేయ‌డం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది అరుదైన ఘ‌న‌త నమోదు చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. కేవ‌లం 145 మ్యాచుల్లోనే అత‌డు ఈ మైల్‌స్టోన్‌ను చేరుకోవ‌డం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బంప‌ర్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఐర్లాండ్ నిర్దేశించిన 194 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి 3 మ్యాచుల సిరీస్‌ను 1-1 తేడాతో స‌మం చేసింది.
Go Back to Shorts
Shaheen Afridi
Pakistan
Cricket
Sports News
Ireland

More Telugu News