Vallabhaneni Vamsi: చెప్పులు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్న వల్లభనేని వంశీ, యార్లగడ్డ వర్గీయులు

fight between Vallabhaneni Vamsi and Yarlagadda Venkat Rao followers
  • రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు ఘర్షణలు
  • గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
  • వంశీ, వెంకట్రావు వారివారి కార్లలో ఉన్న సమయంలోనే ఘటన

ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ వర్గీయులకు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన వర్గీయులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గీయులు ఒకరిపై మరొకరు చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరూ వారివారి కార్లలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. 

మరోవైపు గుంటూరు జిల్లా పెదపరిమిలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది.  వైసీపీ నేత సందీప్ అనుచరులు, టీడీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఆ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. జిల్లా అదనపు ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

  • Loading...

More Telugu News