Annabathuni Siva Kumar: తెనాలిలో ఓటరుపై చేయి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే... ఈసీ సీరియస్

EC orders actions on YCP MLA Annabathuni Siva Kumar
  • పోలింగ్ కేంద్రంలోకి నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని
  • క్యూ లైన్ లో వెళ్లాలన్న గొట్టిముక్కల సుధాకర్ అనే ఓటరు
  • చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే
  • తిరిగి ఎమ్మెల్యేని కొట్టిన ఓటరు!
  • ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు

తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటరుపై చేయి చేసుకున్న ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. 

తెనాలిలో ఈ ఉదయం ఓ పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వచ్చారు. ఆయన బూత్ లోకి వెళుతుండగా, క్యూలైన్ లో ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి అభ్యంతరం చెప్పారు. లోపలికి వెళ్లొద్దని అన్నారు. క్యూ లైన్ నుంచి కాకుండా, నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం ఏంటని ఎమ్మెల్యేని సుధాకర్ నిలదీశారు. 

దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే... సుధాకర్ పై చేయిచేసుకున్నారు. చెంప చెళ్లుమనిపించారు. ఆ ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యేని కొట్టి, గట్టిగానే స్పందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News