ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు ఇవిగో!
- ఫ్యామిలీతో కలిసి ఓటేసిన సజ్జనార్
- హిందూపురంలో బాలయ్య దంపతులు
- హైదరాబాద్ లో కూతురుతో కలిసి ఓటేసిన మాజీ సీజేఐ
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుటుంబం సిటీలో ఓటు హక్కు వినియోగించుకుంది. భార్య, కూతురుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన సజ్జనార్.. క్యూలో నిలబడి ఓటేశారు. ఏపీలోని హిందూపురంలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటేశారు. భార్య వసుంధరతో కలిసి ఆర్టీసీ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో సినీ నటులు, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్‌బాబు, నాగచైతన్య, మంచు మనోజ్, విష్ణు, రాజమౌళి కుటుంబం ఓటు వేశారు. ఇక, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తన భార్యతో కలిసి సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బాలయ్య దంపతులు..

హరీశ్ రావు దంపతులు..

కూతురుతో సీజేఐ..

సతీమణితో రాజమౌళి..

కొడుకుతో మోహన్ బాబు..

అశోక్ గజపతి రాజు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..