Chandrababu: ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు ఫోన్

Chandrababu phone call to APSRTC MD
  • ఏపీలో రేపు పోలింగ్
  • పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తున్న ఓటర్లు
  • బస్సుల కొరత ఉండరాదన్న చంద్రబాబు
  • స్పెషల్ బస్సులు వేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తి

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఫోన్ చేశారు. ఏపీలో రేపు పోలింగ్ జరగనున్నందున, సొంతూళ్లలో ఓటు వేసేందుకు ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారని, వారి కోసం స్పెషల్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 

ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు ఎన్నికల కోసం స్వస్థలాలకు వస్తున్నారని, అదనపు బస్సులు నడపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. 

అంతేకాకుండా, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి జిల్లాలకు స్పెషల్ బస్సులు వేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News