General Elections-2024: తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం బదిలీ చేసిన ఈసీ

EC transfers five CIs fro Tirupati to Anantapur
  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • గీత దాటుతున్న అధికారులు, పోలీసులపై ఈసీ చర్యలు
  • తిరుపతికి చెందిన సీఐలపై టీడీపీ ఫిర్యాదు
  • ఐదుగురు సీఐలను తిరుపతి నుంచి అనంతపురం బదిలీ చేసిన ఈసీ

గీత దాటుతున్న పోలీసులపై, ఇతర అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటోంది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను తాజాగా అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. ఆ సీఐలు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీడీపీ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ... తగిన చర్యలు తీసుకుంది. సీఐలు అంజూ యాదవ్, జగన్ మోహన్ రెడ్డి, వినోద్ కుమార్, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డిలను అనంతపురంలో విధులు నిర్వర్తించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News