CSK: రాజస్థాన్ ను భలే కట్టడి చేసిన చెన్నై సూపర్ కింగ్స్

CSK restricts Rajasthan for a low score

  • చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ × చెన్నై సూపర్ కింగ్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు
  • ఆకట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ లోనూ విజయం తప్పనిసరి అయిన నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ నేడు స్ఫూర్తిదాయక బౌలింగ్ ప్రదర్శన కనబర్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ను అద్భుతంగా కట్టడి చేశారు. 

సొంతగడ్డపై చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో, రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, రాజస్థాన్ కు భారీ స్కోరు సాధ్యం కాలేదు.

 జైస్వాల్ 24, బట్లర్ 21, శాంసన్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. ఈ మూడు వికెట్లు సిమర్జీత్ సింగ్ ఖాతాలో చేరాయి. రియాన్ పరాగ్ 47 పరుగులు (నాటౌట్) చేయగా, ధ్రువ్ జురెల్ 28 పరుగులు చేశాడు. 

చెన్నై బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 3, తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు తీశారు. చెన్నై బౌలర్లు పక్కా ప్లాన్ తో బంతులు విసరడంతో రాజస్థాన్ రాయల్స్ ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయింది.

More Telugu News