polling staff: గుడ్డు కూర.. టమాటా పప్పు! పోలింగ్ సిబ్బందికి పౌష్టికాహార భోజనం

  • 12, 13 తేదీల్లో ఫాలో కావాల్సిన మెనూను పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంపిన ఈసీ
  • ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందించాలని ఆదేశం
  • ఎండల నేపథ్యంలో మధ్యలో మజ్జిగ లేదా నిమ్మరసం ఇవ్వాలని సూచన
diet for poll staff

సార్వత్రిక ఎన్నికల విధులకు ఎంపికైన ఉద్యోగులకు రెండు రోజులపాటు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది. అందుకు అనుగుణంగా మెనూ రూపొందించింది. ఎన్నికల సిబ్బందికి వేళకు ఆహారం అందించే బాధ్యతను పర్యవేక్షించాలని పంచాయతీలు, మున్సిపాలిటీలను ఆదేశించింది.

మెనూ ఇదే..
– ఆదివారం సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది చేరుకోగానే 4 గంటలకు సమోసా, మజ్జిగ, 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం.
– రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య భోజనం. ఇందులో అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ వడ్డిస్తారు.
– సోమవారం (పోలింగ్ రోజు) ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు
– ఉదయం 8 నుంచి 9 మధ్య క్యారట్‌, టమాటాతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ
– ఉదయం 11, 12 గంటల సమయంలో మజ్జిగ.
– మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం. ఇందులో కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు అందిస్తారు.
– మధ్యాహ్నం 3, 4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం.
– సాయంత్రం 5.30 గంటలకు టీ, బిస్కెట్లు.

  • Loading...

More Telugu News