Doctor Wife: హోటల్ బాత్రూంలో ఇద్దరు యువకులతో భర్తకు రెడ్ ‌హ్యాండెడ్‌గా దొరికిన వైద్యురాలు.. వైరల్ వీడియో ఇదిగో!

Doctor Catches Wife In Compromising Position With 2 Men Inside Hotel
  • మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్న వైద్య దంపతులు
  • భార్య ప్రవర్తన, కదలికలపై భర్త అనుమానం
  • హోటల్ బాత్రూంలో పట్టుకుని చితకబాదిన భర్త, కుటుంబ సభ్యులు
  • వైద్యుడి భార్య, ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు

తన నుంచి దూరంగా ఉంటున్న వైద్యురాలైన భార్య ఓ హోటల్ బాత్రూంలో ఇద్దరు యువకులతో అభ్యంతరకర స్థితిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడో వైద్యుడు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

తన భార్య కదలికలు, ప్రవర్తనను అనుమానించిన భర్త రాత్రివేళ హోటల్ రూముకు వెళ్లాడు. అక్కడామె ఇద్దరు యువకులతో సన్నిహితంగా ఉండగా పట్టుకున్నాడు. దీంతో ఆ యువకులపై డాక్టర్, ఆయన కుటుంబ సభ్యులు దాడిచేశారు. వారు కూడా తిరిగి కలబడడంతో హోటల్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

మనస్పర్థల కారణంగా దంపతులు ఇద్దరూ ఏడాది కాలంగా విడిగా ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాత ఇరు వర్గాలు భౌతిక దాడులకు దిగినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఆమెతోపాటు ఘజియాబాద్, బులంద్‌షహర్‌కు చెందిన యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. బాధిత వైద్యుడి ఫిర్యాదు మేరకు వారిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అయితే, ఆమె మాత్రం తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News