Allu Arjun: అల్లు అర్జున్ ప్రచారంపై ఆయన మామ ఏమన్నారంటే..

Allu Arjun Father In Law Chandrasekhar Reddy Reaction About Hero Campaign for YCP Candidate
  • తన స్నేహితుడి కోసమే ప్రచారం చేస్తున్నాడని చంద్రశేఖర్ రెడ్డి వివరణ
  • దేశాన్ని, ప్రజలను ఒక్కటి చేసే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ గెలుపు ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి తరఫున సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించడంపై ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన అల్లుడు అల్లు అర్జున్ ఆయన స్నేహితుడి కోసమే ప్రచారం చేస్తున్నారని వివరించారు. అర్జున్ ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడంలేదని, స్నేహితుడిని గెలిపించాలనే ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ లతో పాటు మెగస్టార్ చిరంజీవి.. ఇలా వారంతా కుటుంబ సభ్యులని గుర్తుచేశారు. అయితే, వారిలో ఒక్కొక్కరూ ఒక్కో పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం పూర్తిగా వారి వ్యక్తిగతమని తెలిపారు. వారు ఎవరూ కూడా ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడంలేదని స్పష్టం చేశారు. 

దేశ ప్రజల మద్దతు ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఉందని, గెలుపు తమదేనని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నానని వివరించారు. దేశాన్ని, దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలను ఒక్కటి చేసే శక్తి కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆరోపిస్తూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపడతారని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News