Rain Alert: ఏపీలో రేపు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

AP will see moderate to heavy rains tomorrow
  • కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
  • గత మూడ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు
  • ఆదివారం నాడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం 

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో రేపు కూడా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, విశాఖ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది. 

అదే సమయంలో సత్యసాయి, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల నమోదైన వర్షపాతం వివరాలను కూడా వెల్లడించింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 14 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు వివరించింది.

  • Loading...

More Telugu News