ఖమ్మంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్
- ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా ఫ్లాగ్ మార్చ్
- శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలన్న అడిషనల్ డీసీపీ
- నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా నిర్వహించినట్లు వెల్లడి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోను కేంద్ర బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
బాటసింగారం, అనాజ్‌పూర్, బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో రాచకొండ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మెదక్ జిల్లాలోని జగదేవ్ పూర్‌లో, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీ, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని వెంకట్రావుపేట, తొగుట, ఘనపూర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.