Allu Arjun: అల్లు అర్జున్, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిలపై కేసు నమోదు!

Police files case against Allu Arjun and Shilpa Ravichandra Reddy
  • ఇవాళ నంద్యాల వచ్చిన అల్లు అర్జున్
  • తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతు
  • అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన జనం
  • అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారన్న ఆర్వో
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ నంద్యాల వచ్చిన సంగతి తెలిసిందే. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ గత పదిహేనేళ్లుగా స్నేహితులు. 

నేడు తన మిత్రుడు శిల్పా రవి కోసం అల్లు అర్జున్ సతీసమేతంగా నంద్యాలలో అడుగుపెట్టారు. శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. 

ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదైంది! తమ అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
Allu Arjun
Shilpa Ravichandra Reddy
Case
Nandyal
YSRCP

More Telugu News