వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ రెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ
- సజ్జల భార్గవ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య
- చంద్రబాబుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు
- కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించిన ఈసీ
వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం... సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ క్రమంలో సజ్జల భార్గవరెడ్డిపై పలు సెక్ష్లన్లతో కేసు నమోదు చేశారు.