Posani Krishna Murali: 500కి పైగా సినిమాలు చేశా .. 100 కోట్లు సంపాదించా: పోసాని

Posani Interview
  • రాజకీయాలు తనకి కొత్త కాదన్న పోసాని 
  • ఇక్కడ ఉత్తములు ఉండరని వ్యాఖ్య  
  • నిజాయతీని నమ్ముతానని వెల్లడి 
  • తనకి భయమనేది తెలియదని స్పష్టీకరణ 

పోసాని కృష్ణమురళి .. రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగానే కాదు, రాజకీయాల పరంగా కూడా తనదైన మార్కును చూపించారు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయన మరింత పాప్యులర్ అయ్యారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"రాజకీయాలలో సర్వోత్తములు .. మానవోత్తములు .. ఉత్తమోత్తములు ఎవరూ ఉండరు. ఉన్నవాళ్లలో ఎవరు బెటర్ అనుకుంటే వారికే ఓటేయాలి. ఇక్కడ పదవి ఉండాలనే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పదవి ఉంటే సేవ చేయవచ్చు అనుకునేవారు కొందరైతే, పదవి ఉంటే తినొచ్చు అనుకునేవారు కొందరు" అని అన్నారు.

" నా వరకూ నేను నిజాన్ని నమ్ముతాను .. నిజాయతీని నమ్ముతాను. నమ్మినదాని కోసం ఎంత దూరమైనా వెళతాను. ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే తెలియదు కాబట్టి దాని గురించిన భయం లేదు. చాలా తక్కువ సమయంలో నేను 500లకి పైగా సినిమాలు చేశాను. 100 కోట్లు సంపాదించాను .. ఎక్కడా అప్పులు లేవు .. ఎలాంటి గోలా లేదు. వందేళ్లు నేను సంతోషంగా బ్రతకగలను" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News