టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి: ధర్మపురి అర్వింద్
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని హెచ్చరిక
- ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సిమి టెర్రరిస్ట్ సంస్థ ప్రకటించిందన్న ఎంపీ
- ఎన్నికలు బీజేపీకి, టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా? అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్య
నిషేధిత సిమిపై 15 తీవ్రవాద కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. పీఎఫ్ఐ, సిమికి కాంగ్రెస్ మాతృసంస్థగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తున్నాయన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఆ సంస్థలే కంట్రోల్ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల పీఎఫ్‌ఐకి అడ్డాగా, బోధన్ నకిలీ పాస్‌పోర్టులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.