వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
- వేములవాడలో కోడె మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోదీ
- ప్రధానికి ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను అందజేసిన వేద పండితులు
- పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వేములవాడ, వరంగల్ బహిరంగ సభల్లో పాల్గొననున్న మోదీ
ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ వేములవాడ, వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రసంగించనున్నారు. మొదట వేములవాడ సభలో పాల్గొని అక్కడి నుంచి వరంగల్ వెళ్లనున్నారు. అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు మద్దతుగా బహిరంగ సభలో మోదీ మాట్లాడుతారు.