TV Rama Rao: చెప్పుతో కొట్టుకున్న జనసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు

Janasena leader TV Rama Rao slapped him self with slipper
  • రామారావు కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ నాయకులు
  • కూటమికి మద్దతు తెలిపిన నేతలు
  • అప్పట్లో వైసీపీకి ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకొని పశ్చాత్తాపం
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు టీవీ రామారావు చెప్పుతో కొట్టుకొని ఎస్సీల తరపున పశ్చాత్తాపం తెలిపారు. కాకినాడలోని గొడారిగుంటలోని ఆయన కార్యాలయానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు కూటమికి మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో గత ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు జరిగిన అన్యాయాలను ప్రస్తావించారు. 

తన కారు డ్రైవర్‌ను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశారని, సీతానగరంలో ఇసుక దందాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేయించారని, వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష పడినా వైసీపీ ఆయనకు టికెట్ ఇచ్చిందని చెప్పారు. ఎస్సీలకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. 

దీనికి స్పందించిన టీవీ రామారావు వాస్తవాలు తెలుసుకున్నందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ఎస్సీలు కూటమికి మద్దతు తెలిపాలని కోరారు. వైసీపీకి ఓటేయవద్దని అప్పట్లో ఎంతగా చెప్పినా వినలేదని, ఇప్పుడు ఆయన పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తన చెప్పుతో చెంపలపై కొట్టుకుంటూ ఎస్సీల తరపున పశ్చాత్తాపం ప్రకటించారు.
TV Rama Rao
Kakinada
Janasena
Andhra Pradesh
MRPS

More Telugu News