అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని మోదీ
- ఉదయం 7.30 గంటల సమయంలో పోలింగ్ బూత్‌కు ప్రధాని
- అహ్మదాబాద్‌లోని రాణిప్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్‌లో ఓటు వినియోగం
- మోదీని చూసేందుకు పోలింగ్ బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం
బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, కాబట్టి అందరూ తరలి వచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. దేశంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ఓటు వేయాలని సూచించారు. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలివుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.
మరోవైపు ఎన్నికలకు సంబంధించి నిర్విరామంగా కవరేజీ అందిస్తున్న మీడియా ప్రతినిధులను మోదీ మెచ్చుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆయన సూచించారు. నీరు బాగా తాగాలని అన్నారు.