Jersey: టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీ!

New jersey for Team India players in T20 World Cup
  • జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో టీ20 వరల్డ్ కప్
  • ఇటీవలే టీమిండియా ఆటగాళ్ల ఎంపిక
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న కొత్త జెర్సీల ఫొటోలు
జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఈ  మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. ఈ భారీ ఈవెంట్ కోసం టీమిండియాను ఎప్పుడో ప్రకటించారు. 

కాగా, ఈ టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ నూతన జెర్సీల ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ కలర్ లో ఈ జెర్సీ ఉంది. ఇదే రకం జెర్సీని టీమిండియా ఆటగాళ్లు 2019 వరల్డ్ కప్ సమయంలోనూ ధరించారు. 

ఇటీవల కాలంలో ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేటప్పుడు టీమిండియా వేర్వేరు జెర్సీలు ధరిస్తూ వస్తోంది. మరి ఈసారైనా కొత్త జెర్సీ లక్ తెస్తుందేమో చూడాలి. 2011 తర్వాత టీమిండియా ఏ ఐసీసీ ఈవెంట్ లోనూ నెగ్గలేదు.
Jersey
Team India
T20 World Cup
BCCI

More Telugu News