Anand Mahindra: రోటీలు అమ్ముతున్న పదేళ్ల కుర్రాడు.. అతని కాంటాక్ట్ నంబర్ కావాలంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌!

Anand Mahindra Tweet on 10 Year old Boy Jasprit who Sale Rotis in Delhi

  • ఢిల్లీలో రోటీలు విక్రయిస్తున్న కుర్రాడి వీడియో షేర్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా
  • సాయం చేస్తామంటూ కుర్రాడి కాంటాక్ట్ నంబ‌ర్ అడిగిన వ్యాపార‌వేత్త‌
  • అత‌ని చ‌దువుకు ఆటంకం క‌ల‌గ‌కుండా మ‌హీంద్రా ఫౌండేష‌న్ సాయం చేస్తుందంటూ ట్వీట్‌

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌దేళ్ల జ‌స్ప్రీత్ అనే కుర్రాడు రోటీలు చేసి అమ్ముకోవ‌డం మ‌నం చూడొచ్చు. మెద‌డు క్యాన్స‌ర్ వ‌ల్ల తండ్రి మ‌ర‌ణించ‌డంతో కుటుంబ బాధ్య‌త‌లు ప‌సివాడిపై ప‌డ్డాయి. 

అత‌నికి ఓ అక్క కూడా ఉంది. త‌ల్లి త‌మ‌ను వదిలేసి వెళ్లిపోవ‌డంతో ఉద‌యం పాఠ‌శాల‌కు వెళ్లి సాయంకాలం ఇలా ఫుడ్ బిజినెస్ చేస్తున్నాడ‌ట‌. ఈ వీడియో చూసి చ‌లించిపోయిన ఆనంద్ మ‌హీంద్రా.. ఆ బాలుడి వివ‌రాలు కావాలంటూ ట్వీట్ చేశారు. "నాకు తెలిసి అది ఢిల్లీలోని తిల‌క్ న‌గ‌ర్ ప్రాంతం అనుకుంటా. మీలో ఎవ‌రికైనా జస్ప్రీత్ కాంటాక్ట్ నంబ‌ర్ తెలిస్తే షేర్ చేయండి. అత‌ని చ‌దువు పాడ‌వ‌కూడ‌దు. మ‌హీంద్రా ఫౌండేష‌న్ టీమ్ అత‌నికి ఎలా చ‌దువు ప‌రంగా సాయం చేస్తుంద‌నేది వివ‌రిస్తుంది" అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆనంద్ మ‌హీంద్రా మంచి మ‌న‌సుకు నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

Anand Mahindra
Twitter
New Delhi
Jasprit
  • Loading...

More Telugu News