Guvvala Balaraju: అడ్డుకున్న స్థానికులు... ప్రచారం మధ్యలో వెళ్లిపోయిన గువ్వల బాలరాజు

Guvvala Balaraju stopped by locals in Achampet
  • అచ్చంపేట మండలం మన్నెవారిపల్లిలో ప్రచారానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే
  • పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేదని స్థానికుల ఆగ్రహం
  • ఎస్ఎల్‌బీసీ, నక్కలగండి నిర్వాసితులకు అన్యాయం చేశారని మండిపాటు
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుకు ఎన్నికల ప్రచారంలో షాక్ తగిలింది. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ప్రచారాన్ని పలువురు అడ్డుకున్నారు. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లిలో సోమవారం ఆయన ప్రచారానికి వెళ్లారు. స్థానికులు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు.

ఎస్ఎల్‌బీసీ, నక్కలగండి నిర్వాసితులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇటీవలి వరకు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ముంపు బాధితులను ఆదుకోలేదని విమర్శించారు. వారు అడ్డుకోవడంతో ఆయన ప్రచారాన్ని మధ్యలో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో రెండుసార్లు గెలిచిన గువ్వల బాలరాజు 2023లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
Guvvala Balaraju
Lok Sabha Polls
BRS

More Telugu News