Revanth Reddy: పొట్టిదొర... ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులుంటావ్?: రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి తీవ్రవిమర్శలు

Mothkupalli Narsimhulu fires at Revanth Reddy
  • మమ్మల్నే బెదిరిస్తావా? అంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం
  • ఇండిపెండెంట్‌గా గెలిచా... ఆరుసార్లు గెలిచా.... నాకు అపాయింటుమెంట్ ఇవ్వవా? అని ప్రశ్న
  • మాదిగ బిడ్డలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రెడ్డి దొర... పొట్టి దొర... రేయ్ పొట్టి దొరా... నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా? మోత్కుపల్లి నర్సింహులు ఇండిపెండెంట్‌గా గెలిచాడు.. అది అర్థం చేసుకోవాలి. మోత్కుపల్లి ఆరుసార్లు గెలిచాడు అది తెలుసుకోవాలి. నువ్వేదో పీకుడుగాని లెక్క మాట్లాడుతున్నావ్' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వవా? దుర్మార్గుడా... నువ్వు మొగోనివా? అన్నారు.

కులాల ప్రాతిపదికన సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతానంటే తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉంటావ్? నా మాదిగ బిడ్డలు నీకు కర్రు కాల్చి వాత పెడతారు.. గుర్తుంచుకో అని హెచ్చరించారు. ఎవడ్రా నువ్వు... మా జాతిని తొక్కేసే కుట్ర చేస్తున్నావని భగ్గుమన్నారు. ఏబీసీడీ వర్గీకరణ గురించి పార్లమెంట్‌లో మాట్లాడకుండా కుట్ర చేస్తున్నాడని ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు.

80 లక్షలున్న మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా, పట్టుమని 10 మంది లేని వేరే కులాలకు టికెట్ ఇస్తావా? అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రకంగా ఇది సమన్యాయమో చెప్పాలన్నారు. దీనిని ఏ రకంగా సమర్థించుకుంటావ్? అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాడని... కానీ చేసేది శూన్యమన్నారు. రేవంత్ రెడ్డి చేతకాని వెధవ అంటూ ఘాటు పదజాలం ఉపయోగించారు.
Revanth Reddy
Mothkupalli Narsimhulu
Congress
MRPS

More Telugu News